: స్పాట్ ఫిక్సింగ్ పై సుప్రీంకోర్టుకు చేరిన నివేదిక


ఐపీఎల్ లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం పై జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ తన నివేదికను ఈ రోజు సుప్రీంకోర్టుకు సమర్పించింది. జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీని సుప్రీంకోర్టు గతేడాది నియమించింది. నివేదికలో వివరాలు వెల్లడి కాలేదు. దీన్ని పరిశీలించిన అనంతరం తగిన తీర్పును వెలువరిస్తామని జస్టిస్ ఏకే పట్నాయక్ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. ఐపీఎల్ లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై తొలుత దర్యాప్తు జరిపిన కమిటీ ఎలాంటి ఆధారాలు లేవని క్లిన్ చిట్ ఇవ్వగా దానిపై బీహార్ క్రికెట్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీని నియమించింది. నాలుగు నెలల పాటు పలు వర్గాల వారిని విచారించిన అనంతరం ఈ కమిటీ తన నివేదికను కోర్టుకు అందించింది.

  • Loading...

More Telugu News