: విశాఖ కేజీహెచ్ లో వైద్య సేవలు బంద్
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో సిబ్బంది వైద్యసేవలను ఆపివేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విధులు బహిష్కరించి, ఈరోజు బంద్ పాటిస్తున్నట్లు వారు తెలిపారు. హైదరాబాదులో నిమ్స్ సహా ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వారు పేర్కొన్నారు. అలాగే, విశాఖ వాసులకు అందుబాటులో ఉన్న కేజీహెచ్ లో అన్ని రకాల వైద్య సేవలను ఆధునికీకరించాలని వారు డిమాండ్ చేశారు.