: సాగునీటి ప్రాజెక్టుల వ్యయం పెంపుపై బొత్స ఆగ్రహం
రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయానికి అంచనాల పెంపును పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. శాసనసభ సమావేశాల ప్రారంభం ముందు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ కూడా ఇచ్చారు. ఈ అంశాన్ని గతంనుంచే వ్యతిరేకిస్తున్న బొత్స.. సీఎం, డిప్యూటీ సీఎంకు అప్పట్లోనే లేఖలు ఇచ్చారు. కాగా, మంత్రివర్గ భేటీకి తెలంగాణ మంత్రులు రాకపోవడాన్ని పీసీసీ చీఫ్ తప్పుబట్టారు. రాకుండా ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలిగిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.