: శాసనసభ, మండలి సమావేశాలు వాయిదా
శాసనసభ సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సభకు సమర్పించారు. అనంతరం సమావేశాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారానికి వాయిదా వేశారు. ఈ ఉదయం 10.30 గంటలకు బీఎసీ సమావేశం ఉంటుందని ప్రకటించారు. మరోవైపు మండలి సమావేశాల్లో మంత్రి రామచంద్రయ్య ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అనంతరం మండలి సమావేశాలు కూడా బుధవారానికి వాయిదాపడ్డాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై అధ్యయనానికి వీలుగా సమావేశాలను వాయిదా వేశారు.