: బడ్జెట్ ను నిరసిస్తూ వాకౌట్ చేశాం: ఈటెల
రాష్ట్ర శాసనసభలో ఈ ఉదయం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసిందని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఈటెల, మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా నిరసించారు. సభ కొనసాగడానికి వీల్లేదని, వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాతే బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పినా ఇలా చేయడం న్యాయం కాదన్నారు. స్వయంగా మంత్రివర్గ సభ్యులే నిరసన తెలుపుతున్నప్పుడు బడ్జెట్ ను ఎలా ప్రవేశపెడతారు? అని ప్రశ్నించారు. కనీసం తాము నిరసన తెలుపుకునేందుకు కూడా స్పీకర్ అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ రోజు జరిగే బీఏసీకి హాజరై నిరసన తెలుపుతామన్నారు.