: ప్రారంభమైన శాసనసభ సమావేశాలు.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమర్పణ
శాసనసభ బడ్జెట్ సమావేశాలు కొద్ది సేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. వరుసగా నాలుగోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. బడ్జెట్ వివరాలను ఆయన సభకు తెలియజేస్తున్నారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి.