: నిబంధనలు ఉల్లంఘించి దొరికిపోయిన వసీం అక్రం


పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రం లాహోర్ లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి దొరికిపోయారు. పంజాబ్ యూనివర్సిటీ క్యాంపస్ వద్ద ఒక కారు వేగంగా దూసుకుపోతోంది. గమనించిన ట్రాఫిక్ వార్డెన్ దాన్ని ఆపాడు. చూస్తే వసీం అక్రం. "ఇక్కడ వేగ పరిమితి గంటకు 60 కిలోమీటర్లు అయితే, మీరు 78 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నారు. కనుక రూ. 500 జరిమానా చెల్లించండి' అంటూ చలానా రాసేశారు. మారు మాట్లాడకుండా రూ. 500 చెల్లించి వసీం అక్రం నిదానంగా ముందుకు సాగిపోయాడు. ఈ విషయాన్ని పోలీసులు ఆదివారం వెల్లడించారు.

  • Loading...

More Telugu News