: విభజన బిల్లుకు నేడు రాష్ట్రపతి ఆమోద ముద్ర?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014 రాష్ట్రపతి వద్దకు చేరింది. కేంద్ర హోంశాఖ ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా ఆదివారం సాయంత్రం దీన్ని పంపించింది. రాష్ట్రపతి దీనికి సోమవారం ఆమోదం తెలుపుతారని భావిస్తున్నామని, బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు హోంశాఖ వర్గాలు పీటీఐ వార్తా సంస్థకు తెలిపాయి. కేంద్ర కేబినెట్ బిల్లుకు శుక్రవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.