: ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బీసీసీఐ శ్రీనివాసన్ సోదరుడు
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్.రామచంద్రన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కి ఈయన స్వయానా సోదరుడు. రామచంద్రన్ ప్రపంచ స్క్వాష్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అధ్యక్షుడితో పాటు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ ను కూడా ఎన్నుకున్నారు. దీంతో, ఇప్పటికైనా భారత ఒలింపిక్ అసోసియేషన్ పై ఉన్న నిషేధాన్ని ఒలింపిక్ సంఘం ఎత్తివేస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.