: సీమాంధ్ర జిల్లాల్లో ప్రారంభమైన సమైక్య రన్
సమైక్యాంధ్రప్రదేశ్ ఆకాంక్షను వెల్లడిస్తూ చేపట్టిన సమైక్య రన్ కార్యక్రమం సీమాంధ్ర జిల్లాల్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. అన్ని చోట్ల సమైక్యాంధ్ర నినాదాలు హోరెత్తుతున్నాయి. టీబిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సమైక్యవాదులు హెచ్చరిస్తున్నారు.