: కేంద్ర మంత్రులు రాజ్యసభకు వచ్చి సమైక్యవాణి వినిపించాలి: సీఎం రమేష్
విభజన బిల్లు మొదట రాజ్యసభకు రానున్న నేపథ్యంలో, సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాజ్యసభకు వచ్చి తమ సమైక్యవాణి వినిపించాలని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ డిమాండ్ చేశారు. సమైక్యవాదాన్ని గట్టిగా వినిపిస్తున్న టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేసి... బిల్లును ఆమోదింపజేసుకోవాలనే కుటిల యత్నాలు చేస్తున్నారని చెప్పారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పుల తడకగా ఉన్న టీబిల్లుపై రాష్ట్రపతి గుడ్డిగా సంతకం చేశారని విమర్శించారు. టీబిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాలా? వద్దా? అనే విషయంలో రూల్ 67 కింద డివిజన్ కోరుతూ నోటీసు ఇచ్చానని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోను టీబిల్లు రాజ్యసభలోకి రాకుండా అడ్డుకుంటామని చెప్పారు.