: బిల్లును అడ్డుకోకపోతే ఇళ్లను ముట్టడిస్తాం: సీమాంధ్ర కేంద్ర మంత్రులకు అశోక్ బాబు హెచ్చరిక


టీబిల్లును అడ్డుకుని చరిత్రలో స్థానం సంపాదిస్తారా? లేక అధిష్ఠానానికి సహకరించి చరిత్రహీనులుగా మిగిలిపోతారా? అంటూ సీమాంధ్ర కేంద్ర మంత్రులను ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు నిలదీశారు. ఢిల్లీ వస్తున్నామని... ఆ సందర్భంలో సీమాంధ్ర కేంద్ర మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. విజయవాడలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్యం కోసం చేసిన పోరాటంలో విద్యార్థులు, ఉద్యోగులు, లాయర్లు... ఇలా అన్ని వర్గాలు ఎంతో నష్టపోయాయని... కేంద్ర మంత్రులు మాత్రం హాయిగా ఉన్నారని విమర్శించారు. పార్లమెంటును ఎంపీలు స్తంభింపజేయాలని... సీమాంధ్రులంతా ఎంపీల వెంట ఉంటారని తెలిపారు. రేపటి నుంచి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పారు. అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రం కోరుకునే వారంతా ఉద్యమంలో ముందుండాలని సూచించారు.

  • Loading...

More Telugu News