: బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఎండీఎంకే
చెన్నైలో ఉన్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఎండీఎంకే అధినేత వైగో ఓ హోటల్లో కలిశారు. అనంతరం వైగో మాట్లాడుతూ, రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలసి పనిచేస్తామని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి మోడీ నాయకత్వం ఎంతో అవసరమని వైగో వ్యాఖ్యానించారు.