: కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలను అగౌరవపరుస్తోంది: శైలజానాథ్
తెలుగు ప్రజలను అగౌరవపరిచేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. అసెంబ్లీలో తిరస్కరణకు గురైన టీబిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడమంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో విభజన బిల్లును కేంద్ర మంత్రులు, ఎంపీలు అడ్డుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తమ భవిష్యత్ రాజకీయాలపై ఆలోచిస్తామని తెలిపారు.