: ఈ అప్లికేషన్ ప్రేమ కోసం!
ప్రియురాలికి ఐ లవ్ యూ చెప్పాలనుకుంటారు. పనిలో పడి మర్చిపోతారు. లంచ్ సమయానికి తిన్నావా? అని అడగాలని అనుకుంటారు. తీరా ఆ సమయం దాటిపోయిన తర్వాత గానీ విషయం గుర్తుకు రాదు. ప్రేమ జంట కావచ్చు. భార్యభర్తలు కావచ్చు. ఒకరినొకరు దూరంగా ఉన్నా ప్రేమను చిగురింపజేస్తూనే ఉండేందుకు గ్రెగ్ ఖాస్ అనే సాఫ్ట్ వేర్ డెవలపర్ 'రొమాంటిమేటిక్' పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్ రూపొందించాడు. గ్రెగ్ ఖాస్ తన 18 ఏళ్ల వైవాహిక జీవితంలో భాగస్వామికి ఇలానే ఎన్నోసార్లు మనసులో భావాలను చెప్పాలనుకుని మర్చిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే, తనలా మరొకరు ఫీలవరాదనే ఉద్దేశంతో అప్లికేషన్ ను రూపొందించాడు. ఇది మొబైల్లోకి డౌన్ లోడ్ చేసుకుని సమయం, పంపించాల్సిన నంబర్, సందేశం సెట్ చేసి పెట్టుకుంటే.. సరిగ్గా అదే సమయానికి ప్రియురాలికి మెస్సేజీ వెళుతుంది. ప్రేమ పరిమళిస్తుంది!