: ఢిల్లీలో దారుణ అత్యాచారం
అత్యాచార రాజధానిలో మరో ఘోరం జరిగిపోయింది. మణిపూర్ కు చెందిన 14ఏళ్ల బాలికపై కామాంధుడు పలుసార్లు ఘోరంగా అత్యాచారం చేశాడు. ఆరు నెలలుగా ఆ బాలిక మునిర్కా ప్రాంతంలోని బంధువుల ఇంట్లో ఉంటోంది. శుక్రవారం రాత్రి సరుకుల కోసం బయటకు రాగా, ఇంటి యజమాని కొడుకు విక్కీ(18) బాలికను అపహరించి ఒక గదికి తీసుకెళ్లి ఆమెపై పలుసార్లు అత్యాచారం చేశాడు. తీవ్ర గాయాలైన ఆమెను సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీలోని ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.