: ఏఏపీపై విమర్శలు, మమతపై ప్రశంసలు కురిపించిన అన్నా హజారే
ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే ఆమ్ ఆద్మీ పార్టీపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఏదీ వద్దంటూనే, ఆ తర్వాత తీసుకునే వాళ్లు ఉంటారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యమంత్రి అయినా నేత చీరలు, స్లిప్పర్లు ధరించి... తన తండ్రికి చెందిన చిన్న ఇంటిలోనే ఉన్నారని కొనియాడారు. ప్రతి రోజు పాదయాత్రలు చేస్తూ, ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారని చెప్పారు. ఈ దేశాన్ని పాలించగల సత్తా ఆమెకు ఉందని తాను నమ్ముతున్నానని తెలిపారు.