: చిరంజీవికి సీమాంధ్రలోనూ తప్పని నిరసన సెగలు
కేంద్రమంత్రి చిరంజీవికి తెలంగాణ ప్రాంతంలోనే కాదు.. సీమాంధ్రలోనూ నిరసన సెగలు తగులుతున్నాయి. ఇటీవలే వేములవాడలో చిరంజీవి కార్యక్రమానికి తెలంగాణ వాదులు అడ్డుతగిలారు. అదే విధంగా ఈ రోజు చిరంజీవి కాన్వాయ్ ను తూర్పు గోదావరి జిల్లా కంబాలచెరువు వద్ద సమైక్యవాదులు అడ్డుకునే యత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుతప్పించడంతో కాన్వాయ్ ముందుకు సాగిపోయింది.