: ఫిబ్రవరి 12న తెలంగాణ బంద్: మావోయిస్ట్ పార్టీ
కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదించిన తెలంగాణ బిల్లులో సవరణలు చేపట్టాలని కోరుతూ ఈ నెల 12వ తేదీన తెలంగాణ ప్రాంత బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఎటువంటి ఆంక్షల్లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట మీడియాకు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర రాజధాని నగరంపై ఎవరి పెత్తనాన్ని అంగీకరించబోమని, సహించబోమని మావోయిస్టు పార్టీ పేర్కొంది. సీమాంధ్ర ప్రాంతం కోసం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును నిలిపివేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.