: సీఎం విలువలున్న నేత అంటున్న సీపీఐ నారాయణ!
సీఎం కిరణ్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన విలువలున్న నాయకుడని కొనియాడారు. కిరణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో కొనసాగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ చేతగాని తనం వల్లే రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకుపోయిందని దుయ్యబట్టారు. జైల్లో ఉన్న బందిపోటు దొంగలు కూడా బయటికొచ్చి కాలర్ ఎగురవేస్తున్నారని విమర్శించారు.