: సౌందర్యతో పెళ్లైందని వచ్చిన వార్తలు పనిలేని వాళ్లు పుట్టించినవి: జగపతి బాబు


జగపతి బాబు.. ఒకప్పుడు సక్సెస్ ఫుల్ హీరోగా వెలిగిన వ్యక్తి. అప్పట్లో హీరోయిన్ సౌందర్యతో ఆయన చాలా సినిమాలు చేశారు. దాంతో, జగపతికి, సౌందర్యకు సంబంధం ఉందని పుకార్లు కూడా వచ్చాయి. దాన్నే ఓ తెలుగు వార్తా చానల్ తమ ఇంటర్వ్యూలో జగపతిని అడిగితే.. సౌందర్యతో పెళ్లైందని వచ్చిన వార్తలు పనిలేని వాళ్లు పుట్టించినవని కొట్టిపారేశారు. ఓసారి తను, తన భార్య ఇంట్లో కూర్చున్నప్పుడు ఒకరు ఫోన్ చేసి ఆ విషయం చెప్పారన్నారు. ఇలాంటి వాటి గురించి తానస్సలు పట్టించుకోనన్నారు.

అంతేగాక తమ బ్యానర్ జగపతి ఆర్ట్స్ ను సరిగా నడపలేకపోయిన బ్యాడ్ బిజినెస్ మ్యాన్ ను అని నిర్మొహమాటంగా చెప్పారు. హీరోగా అవకాశాలు తగ్గడం వల్ల, ప్లాప్ అవుతాయని తెలిసి కూడా ఓ నాలుగు సినిమాలు చేశానన్నారు. అందుకే, తాజాగా రూటు మార్చానని, అందులో భాగంగా తొలిసారి విలన్ గా బాలకృష్ణ చిత్రం 'లెజండ్'లో కనిపించబోతున్నట్లు వివరించారు.

  • Loading...

More Telugu News