: జూనియర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న జహీర్ ఖాన్
మహ్మద్ షమి.. ఈ బెంగాల్ పేసర్ ఇప్పుడు టీమిండియా భవితవ్యంపై సరికొత్త ఆశలు రేపుతున్నాడు. ఆడింది కొన్ని మ్యాచ్ లే అయినా, నికార్సయిన పేస్ తో బ్యాట్స్ మెన్ ను వణికిస్తున్న ఈ జూనియర్ బౌలర్ పై సీనియర్ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. న్యూజిలాండ్ ను రెండో ఇన్నింగ్స్ లో 105 పరుగులకే మడత వేయడంలో కీలకపాత్ర పోషించిన షమి (3/37) మ్యాచ్ విన్నర్ అని అభివర్ణించాడు. నాణ్యమైన బౌలింగ్ తో ఆకట్టుకుంటున్న షమి అనుభవంతో మరింత కాంతులీనుతాడని అభిప్రాయపడ్డాడు. టీమిండియాకు షమి వరంలాంటివాడని జహీర్ కితాబిచ్చాడు.