: కాంగ్రెస్ ను ఇంటికి పంపడం ఖాయం: నరేంద్ర మోడీ
అసోం రాష్ట్రంలోని గౌహతి నగరంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే అసోంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన అన్నారు. ఆ పార్టీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కుటుంబానికే సేవ చేస్తోందని ఆయన విమర్శించారు.