: బిల్లును అడ్డుకుని తీరుతాం: రాయపాటి
ఎట్టిపరిస్థితుల్లో పార్లమెంటులో టీబిల్లును అడ్డుకుని తీరుతామని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి వరకు పోరాడుతామని చెప్పారు. ఒంట్లో నలతగా వున్న సీఎం కిరణ్ ను పరామర్శించేందుకు ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.