: గోదావరి స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి


ఖమ్మం జిల్లా భద్రాచలం సమీపంలో గోదావరి నదికి స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న తేజ, పవన్ లు స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. వారు గాలింపు చర్యలు చేపట్టి.. మృత దేహాలను వెలికితీశారు.

  • Loading...

More Telugu News