: తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా


తిరుమల ఘాట్ రోడ్డులో ఈ ఉదయం బస్సు బోల్తా కొట్టింది. బస్సు తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా ఒకటో నెంబర్ ఘాట్ రోడ్డుపై భారీ మలుపు వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 40 మంది భక్తులకు గాయాలయ్యాయి. మలుపు వద్ద బస్సు వేగంగా వెళుతుండగా, డ్రైవర్ స్టీరింగ్ పై అదుపు కోల్పోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులను తిరుపతిలోని ఎస్వీఆర్ఆర్ ఆసుపత్రికి తరలించారు. బస్సు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో, టీటీడీ అధికారులు బస్సును తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News