: సీఎంకు స్వల్ప అస్వస్థత!
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. భుజం నొప్పి కారణంగా ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో, వైద్యులు ఆయనకు ఫిజియోథెరపీ చికిత్స అందిస్తున్నారు. మరోవైపు మంత్రులు పితాని సత్యనారాయణ, పార్థసారథి, ఆనం రాంనారాయణ, ఏరాసు ప్రతాపరెడ్డి, కొండ్రు మురళి, మహీధర్ రెడ్డి, టీజీ వెంకటేష్ సహా పలువు పార్టీ నేతలు క్యాంపు కార్యాలయంలో సీఎంను పరామర్శించారు.