: కిరణ్ వ్యతిరేకంగా మాట్లాడలేదు: దిగ్విజయ్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కు, సోనియాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. విభజనపై అభిప్రాయాలు చెప్పేందుకు అందరికీ స్వేచ్ఛ ఇచ్చామన్నారు. అయితే, తెలంగాణపై ఇచ్చిన మాటకు బీజేపీ కట్టుబడి ఉండాలన్నారు.