: ఈమెను ఇండియన్ లేడీ గాగా అందామా..!


ఇంటర్నేషనల్ పాప్ స్టార్లలోకెల్లా లేడీ గాగా విలక్షణం. ఆహార్యం చూస్తే.. 'ఛ, ఇలాంటి దుస్తులు బయట వేసుకుంటే జనాలు వెంటబడి తరుముతారు' అనిపించేలా ఉంటాయి. ఇక ఆవిడ హెయిర్ స్టయిల్స్ చూస్తే ముఖం ఎక్కడుందో సరిగా కనిపించక నానా అవస్థలు పడాలి. అప్పుడెప్పుడో గ్రామీ అవార్డుల వేడుకలో మాంసంతో రూపొందించిన గౌను వేసుకుని వచ్చి అందరికీ రోత పుట్టించింది. ఇప్పుడామె బాటలోనే ఓ భారత సెలబ్రిటీ నడుస్తున్నట్టుంది. ఆమె పేరు తనీషా సింగ్. జంతువులను కాపాడండంటూ మేక మాంసంతో తయారైన డ్రెస్ తో ఫొటోలకు పోజులిచ్చింది. అప్పట్లో లేడీ గాగా గొడ్డుమాంసంతో తయారైన డ్రెస్ వేసుకోగా, మన గాగా మేక మాంసంతో రూపొందించిన గౌను ధరించింది, అంతే తేడా. ఇదంతా ఫేమ్ కోసమేనని వేరే చెప్పలా..!

  • Loading...

More Telugu News