: తిరస్కరించి పంపిన బిల్లును కేంద్రం ఆమోదించడం సరికాదు: గంటా
రాష్ట్ర శాసనసభ తిరస్కరించి, తిప్పి పంపిన విభజన బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడం సరికాదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. అయితే, బీజేపీ, సమాజ్ వాదీ, వివిధ పార్టీలు వ్యతిరేకిస్తున్నందున బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందదని అభిప్రాయపడ్డారు. కాగా, కొత్త పార్టీ గురించి తాము ఆలోచించడం లేదన్నారు. రాష్ట్ర సమైక్యత కోసమే కృషి చేస్తామని చెప్పారు.