: ఏపీ భవన్ లో రేణుకా చౌదరి, టీ.ఉద్యోగుల పోటాపోటీ ఆందోళన
ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఓయూ విద్యార్థి జేఏసీ, ఉద్యోగ సంఘాలు చేపట్టిన దీక్ష ఎంపీ రేణుకా చౌదరి రాకతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వారి దీక్షకు మద్దతు తెలిపేందుకు రేణుక అక్కడికి రాగానే.. గో బ్యాక్ అంటూ ఉద్యోగ సంఘాల నేతలు నినాదాలు చేశారు. దాంతో, రేణుక వర్గం, ఉద్యోగుల మధ్య తోపులాట జరిగింది. ఇన్నాళ్లు లేని రేణుక ఇప్పుడెందుకు వచ్చారంటూ ఉద్యోగులు ప్రశ్నించారు. నిరసనగా అప్పటికే చేస్తున్న దీక్షకు ఎదురుగానే ఉద్యోగులు దీక్ష చేపట్టారు. అటు రేణు విద్యార్థి జేఏసీనేతలతో కూర్చొని వారికి సంఘీభావం ప్రకటించారు. దాంతో, పోటాపోటీగా ఏపీ భవన్ లో దీక్ష చేపట్టాల్సి వచ్చింది.