: ముచ్చటైన డేటింగ్ కోసం 30 సూత్రాలు రాసిన అమ్మాయిలు!
జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు వాళ్ళు తమకు తగినవారో కాదో వివాహానికి ముందే తెలుసుకునేందుకు పాశ్చాత్య దేశాల్లో ఎప్పటినుంచో డేటింగ్ విధానం ప్రాచుర్యంలో ఉంది. మనదేశంలోనూ ఈమధ్య కాలంలో తరచూ వినిపిస్తోందీ డేటింగ్ మాట. టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిల్లోనూ ఈ ధోరణి ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే, పట్టుమని పదేళ్ళు కూడా లేని ఇద్దరు అమెరికా బాలికలు డేటింగ్ పై ఎంత పరిశోధన చేశారో చూడండి. భవిష్యత్తులో తాము డేటింగ్ చేయబోయే అబ్బాయిలు ఎలా ఉండాలో ఓ 30 సూత్రాలతో వివరించారు. ఆరేళ్ళ క్లెయిర్, తొమ్మిదేళ్ళ బ్రూక్ ఈ సూత్రావళి సృష్టికర్తలు. తమ ఫ్యూచర్ బాయ్ ఫ్రెండ్స్ పాటించాల్సిన నియమాలంటూ వాళ్ళు రాసిన సూత్రాల్లో కొన్ని..
1. డేటింగ్ మొదటి రోజునే ముద్దుకు వెంపర్లాడకూడదు. 2. మితంగా తినేవాళ్ళయి ఉండాలి. 3. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. 4. మంచి ఉద్యోగం చేస్తుండాలి. 5. డ్రస్ సెన్స్ కలిగి ఉండాలి. 6. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలి, కానీ, తల్లిదండ్రుల వద్ద ఉండకూడదు. 7. గరిటె తిప్పగలిగి ఉండాలి. 8. అతగాడి లాస్ట్ నేమ్ మరీ భయంకరంగా ఉండకూడదు... వీటిని బట్టి చూస్తుంటే ఈ అమ్మాయిల వయసు కొంచెమే అయినా బుద్ధి ఘనం అనిపించడంలేదూ..?