: హీరో మోటో కార్ప్ నుంచి రానున్న మూడు స్కూటర్లు


ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ 'హీరో మోటోకార్ప్' మూడు స్కూటర్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 110సీసీ డాష్ ను వచ్చే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ లోపు విడుదల చేయనుంది. 125సీసీ డేర్ స్కూటర్ ను అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చిలోపు విడుదల చేయనున్నట్లు హీరో మోటోకార్ప్ ఎండీ పవన్ ముంజాల్ తెలిపారు. అలాగే, 150సీసీ జిర్ స్కూటర్ ను 2015-16 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో విడుదల చేస్తామని చెప్పారు.

ఈ మూడు మోడళ్లను నోయిడాలో జరుగుతున్న భారతీయ ఆటో ప్రదర్శనలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ఆవిష్కరించారు. స్కూటర్ మార్కెట్లో వృద్ధి వేగంగా ఉందని.. కనుక తమ స్కూటర్ల పోర్ట్ ఫోలియోను విస్తరించనున్నట్లు పవన్ ముంజాల్ తెలిపారు. ఈ విభాగంలో మార్కెట్ లీడర్ అవడమే తమ ధ్యేయమన్నారు.

  • Loading...

More Telugu News