: సజీవ సమాధి అయిన కూలీలు
వాటర్ పైప్ లైన్ తవ్వుతుండగా... పక్కనే ఉన్న చెరువు కట్ట మట్టి పెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు సజీవ సమాధి అయ్యారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామంలో జరిగింది. ఈ ప్రమాదంలో కొయ్యల వాసు, రఘునాథ్ అనే కూలీలు మృతి చెందారు. జేసీబీల ద్వారా మట్టిని తొలగించి మృత దేహాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.