: కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్.. భారీగా ఆస్తి నష్టం


మెదక్ జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో ఉన్న ప్రగతి ఆర్గానిక్స్ ఫ్యాక్టరీలో ఈ తెల్లవారుజామున రియాక్టర్ పేలింది. ప్రొడక్షన్ బ్లాక్ లో ఫోర్ క్యాంప్స్ అనే రసాయనాలను రియాక్టర్ లో వేస్తుండగా ఈ పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న ఓ కార్మికుడు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 3 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News