: మారుతి 800కు సెలవిక
భారత్ లో లక్షలాది మంది 'కారు' కలను సాకారం చేసింది. కారు యజమానులమనే ముచ్చట తీర్చింది. రూ. 50వేల రూపాయల కారుగా 1980లలో మార్కెట్లో అడుగుపెట్టింది. అపూర్వ ఆదరణతో దేశంలోనే అత్యధిక సంఖ్యలో అమ్ముడుపోయింది. అదే మారుతి 800 మోడల్ కారు. మారుతి నుంచి వచ్చిన తొలి కారు ఇదే. కానీ, ఇకపై ఇది చరిత్రకే పరిమితం!
గత నెల 18 నుంచి మారుతి 800 మోడల్ కార్ల ఉత్పత్తి శాశ్వతంగా నిలిచిపోయింది. ఈ మోడల్ కార్ల ఉత్పత్తి నిలిచిపోయినా.. వచ్చే 8 నుంచి 10 సంవత్సరాల వరకు ఉపకరణాలు(స్పేర్స్) అందుబాటులో ఉంటాయని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఈడీ సీవీ రామన్ తెలిపారు. డీలర్ల వద్ద కొంతవరకు 800 మోడల్ కార్లు ఉన్నాయని వాటి సంఖ్య కచ్చితంగా తెలియదని చెప్పారు. మారుతి 800 చివరి ధర రూ. 2.35లక్షలు(ఢిల్లీలో).