: 'గాలి'కి ఏప్రిల్ 2 వరకు జ్యుడిషియల్ రిమాండ్


ఇనుప ఖనిజం అక్రమ ఎగుమతి కేసులో గాలి జనార్థన రెడ్డి, అతని పీఏ అలీ ఖాన్ లకు ఏప్రిల్ 2 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఈరోజు బెంగళూరు సమీపంలోని పరప్పన అగ్రహార జైలు వద్ద గల ప్రత్యేక కోర్టు ఎదుట గాలి, అలీ ఖాన్ హాజరయ్యారు.

వీరిద్దరినీ జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని సీబీఐ తరుపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీంతో, ప్రత్యేక న్యాయస్థానం గాలి, అలీ ఖాన్ లతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురి రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు, వీరికి ఈనెల 19 వరకు కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News