: ఢిల్లీలో ధర్నా చేయాలనుకుంటున్నారా... అయితే ముందుగా సంప్రదించండి!


దేశ రాజధాని ఢిల్లీలో కనిపిస్తున్న ఓ ప్రకటన ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంతకీ ఏంటా ప్రకటన అని ఆలోచిస్తున్నారా? 'దాదాపు ఐదువేల మందితో మీరు నిరసన లేదా ధర్నా చేపట్టాలనుకుంటున్నారా! వెల్ కమ్ టు జంతర్ మంతర్. అందుకోసం మీరు 011-23747777 నంబర్ ద్వారా ఢిల్లీ పోలీసు కమిషనర్ ను సంప్రదించండి ' అంటూ ఓ ప్రకటన ఆహ్వానం పలుకుతుంది. ఆమధ్య ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన క్యాబినెట్ మంత్రులతో కలసి ఢిల్లీలోని రైల్వే భవన్ వద్ద ధర్నా చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు పలు సార్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, ఇతర చోట్ల కూడా ఎన్నో ధర్నాలు, నిరసన ర్యాలీలు జరిగాయి. రాష్ట్ర సమైక్యత కోసం మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మొన్ననే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మౌన దీక్ష చేపట్టారు.

అక్కడయితే, దేశ వ్యాప్తంగా అందరికీ తెలుస్తుందని, తమ ధర్నాకు మంచి పేరు కూడా వస్తుందని చాలామంది ఇక్కడే నిరసనలు చేస్తున్నారు. దాంతో, ఎటువంటి సమాచారం లేని ఢిల్లీ పోలీసులు వారిని నివారించలేక, అదుపు చేయలేక తెగ కష్టపడిపోతున్నారు. ఇక లాభం లేదనుకున్న ఢిల్లీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఆంగ్ల పత్రికలకు పైవిధంగా ప్రకటన ఇచ్చారు. అంటే ఇకనుంచి ఎవరు ధర్నా, నిరసన చేసుకోవాలన్నా ముందుగా ఢిల్లీ పోలీసు కమిషనర్ ను ముందుగా సంప్రదించాలన్నమాట!

  • Loading...

More Telugu News