: హెచ్.ఆర్.సీ.లో హైకోర్టు న్యాయవాది పిటీషన్
మానవ హక్కుల కమిషన్ (హెచ్.ఆర్.సీ)లో హైకోర్టు న్యాయవాది పిటీషన్ దాఖలు చేశారు. జంట నగరాల్లోని ఆటో పర్మిట్ల విషయంలో ఆర్టీఏ అధికారులు ఏజన్సీలతో కుమ్మక్కయ్యారని ఆయన హెచ్.ఆర్.సీకి దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొన్నారు. ఏజెన్సీల నుంచి పాత ఆటోల పర్మిట్లను తీసుకుని కొత్త ఆటోలకు ఇస్తున్నారని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ పై హెచ్.ఆర్.సీ. స్పందించింది. మార్చి 19లోగా వివరణ ఇవ్వాలని హైదరాబాదు కమిషనర్ ను ఆదేశించింది.