: హీరోయిన్ తనయుడి అపహరణ
తన తనయుడిని తన మాజీ భర్తే అపహరించాడని తమిళ నటి చార్మిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త రాజేశ్ తో పొసగక గత కొంతకాలం నుంచి చార్మిళ కుమారుడితో కలసి చెన్నైలోని సాలిగ్రామంలో ఉంటోంది. అయితే, తన కుమారుడు అడోనిస్ జూడ్ ను బలవంతంగా మతం మార్పించేందుకు భర్త తరుపు బంధువులు ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలో రాజేశ్ గత నెల 24న ఇంటికి తీవ్రంగా దుర్భాషలాడి తన కుమారుడిని కిడ్నాప్ చేసి ఉంటాడని ఆమె ఆరోపిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా, తన చిన్నారికి శ్వాసకోశ వ్యాధి ఉందని చార్మిళ తెలిపింది. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న చార్మిళ తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది.