: అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి


ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన ఓ తెలుగు కుర్రాడు అర్ధాంతరంగా అసువులు బాసాడు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం చిన్న రేవల్లి గ్రామానికి చెందిన 24 యేళ్ల అరవింద్ రెడ్డి భారత కాలమానం ప్రకారం నిన్న (గురువారం) మధ్యాహ్నం చనిపోయినట్లు అతని మిత్రులు తెలిపారు.

రేవల్లి గ్రామానికి చెందిన వాడ్యాల శ్రీధర్ రెడ్డి, వాసుదేవి దంపతులకు అరవింద్ రెడ్డి ఏకైక కొడుకు. మహబూబ్ నగర్ పట్టణంలోని జయప్రకాష్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూరి చేసి, ఉన్నత చదువుల కోసం మూడు సంవత్సరాల కిందట కాలిఫోర్నియాకు వెళ్లాడు. అనుమతి లేని ఓ కళశాలలోనే రెండేళ్లు చదవి నష్టపోయాడు. ప్రస్తుతం ప్రిమెట్ లోని వార్డ్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్శిటీలో ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. మొన్న (బుధవారం) మధ్యాహ్నం తండ్రితో అరవింద్ ఫోన్ లో మాట్లాడాడు. తర్వాత స్నేహితులు పార్టీకి పిలవడంతో కాలిఫోర్నియాలోని ఓ హోటల్ కు వెళ్లాడు. అక్కడి గదిలోనే అరవింద్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

కొడుకు మరణవార్త తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అటు భారత రాయబార కార్యాలయం అధికారులు జోక్యం చేసుకుని అతని మరణంపై విచారణ జరిపించి, నిందితులను శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తానా, ఆటా సంఘాలు అరవింద్ మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News