: చెన్నైకి విమాన సర్వీసులు తగ్గించిన లంక


శ్రీలంకలో తమిళులపై దురాగతాలకు వ్యతిరేకంగా తమిళనాడులో మిన్నంటుతున్న ఆందోళనల ప్రభావం విమాన సర్వీసులపైనా పడింది. చెన్నైలో నిరసనలు తీవ్ర రూపం దాల్చుతుండడంతో కొలంబో నుంచి విమాన సర్వీసులను సగానికి సగం తగ్గించాలని శ్రీలంక ఎయిర్ లైన్స్ నిర్ణయించింది.

లంక జాతీయులపై తమిళనాడులో దాడులు జరగడంతో శ్రీలంక ఎయిర్ లైన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య ప్రయాణించేవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గడంతో తాము విమానాల సంఖ్యను 28 నుంచి 14కు కుదించినట్టు శ్రీలంక ఎయిర్ లైన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

  • Loading...

More Telugu News