: ఇంటర్వ్యూ ఆధారంగా ఏఏపీ అభ్యర్థుల ఎంపిక
ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తోంది. కళంకిత ప్రజా ప్రతినిధుల ఏరివేతే ప్రధాన ఎజెండాగా ముందుకెళుతున్న ఏఏపీ.. ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి వైభవ్ మహేశ్వరి తెలిపారు.
ఏఏపీ నుంచి పోటీ చేసేందుకు భారీగా దరఖాస్తులు రావడంతో ఇంటర్వ్యూల ప్రాతిపదికన ఎంపిక ఖరారు చేస్తామని ఆమె చెప్పారు. అభ్యర్థుల ఎంపికను ఇవాళ్టి నుంచి ఆరంభించనున్నట్లు వైభవ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 80 లోక్ సభ స్థానాలకు గాను 900 దరఖాస్తులు అందాయని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా దీనికి సంబంధించిన జాబితాను సిద్ధం చేయనున్నట్లు ఆయన తెలిపారు.