: పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు సమ్మె నుంచి మినహాయింపు: అశోక్ బాబు
సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్న ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు కొత్త కార్యక్రమాలు ప్రకటించారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు సమ్మె నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఆ రోజు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వమన్నారు. ఇక ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల బంద్, 12న జాతీయ రహదారుల దిగ్బంధం, 17, 18న చలో ఢిల్లీ కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇందులో నెలాఖరులోగా 'టెట్' నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. పార్లమెంటులో బిల్లు పెడితే ఆందోళనలు మరింత తీవ్రం చేస్తామని ఏపీఎన్జీవో భవన్ లో మీడియా ద్వారా హెచ్చరించారు.