: వచ్చే ఏడాది సైన్యానికి అందనున్న అగ్ని-5


శత్రుభీకర క్షిపణి అగ్ని-5 వచ్చే ఏడాది భారత సైన్యానికి అందనుంది. 5,500 కిమీ పరిధిలో విధ్వంసం సృష్టించగల ఈ ఖండాంతర క్షిపణి భారత్ అమ్ములపొదిలో అత్యున్నతమైనది. ఇంకా కొన్ని పరీక్షలు మిగిలున్నందన, వాటన్నింటిని పూర్తి చేసి, క్షిపణిని భారత త్రివిధ దళాల పరం చేస్తామని డీఆర్డీవో చీఫ్ అవినాశ్ చందర్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన రక్షణరంగ ఉత్పత్తుల ప్రదర్శనలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, అణుబాంబులు మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న ఈ క్షిపణి చేరికతో భారత రక్షణ పాటవం మరింత పదునుదేరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News