: ఏపీ భవన్ లో తెలంగాణవాదుల మౌనదీక్ష
ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణవాదులు మౌనదీక్ష చేపట్టారు. సంపూర్ణ తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని కోరుతూ దీక్షకు కూర్చున్నారు. టీ జేఏసీ కన్వీనర్ కోదండరామ్, ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి దీక్షకు హాజరయ్యారు.