: సోచిలో ఒలింపిక్స్ సందర్భంగా.. అతిథుల బాత్రూముల్లో స్పై కెమెరాలు!


రష్యాలోని సోచిలో శీతాకాల ఒలింపిక్స్ క్రీడలు నేటితో ఆరంభం కానున్నాయి. ఈ సమయంలో రష్యా ఉపాధ్యక్షుడు ద్విమిత్రి కోజెక్ బాంబు పేల్చారు. కొందరు అతిథులు బస చేసే హోటల్ గదుల్లోని స్నానాల గదుల్లో నిఘా కెమెరాలు పెట్టామని చెప్పారు. దీంతో ఇదో పెద్ద గందరగోళానికి దారితీసింది. సోచిలో ఒలింపిక్స్ ను కవర్ చేయడానికి వచ్చిన విదేశీ జర్నలిస్టులు అక్కడి సౌకర్యాలపై ఫిర్యాదు చేశారు. దీనిపై ద్విమిత్రి జర్నిలిస్టులపై మండిపడ్డారు. ఒలింపిక్స్ క్రీడలను చెడ్డగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అలాగే నిఘా కెమెరాలు పెట్టామని ఆయన పనిలో పనిగా నోరు జారారు. అయితే, హోటల్ గదుల్లో నిఘా ఏమీ లేదని ద్విమిత్రి ప్రతినిధి ఆ తర్వాత ప్రకటించడం విశేషం.

  • Loading...

More Telugu News