: అత్యాచార నిరోధక బిల్లుకు లోక్ సభ ఓకే


అత్యాచార నిరోధక బిల్లుపై ప్రస్తుతం లోక్ సభలో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. కాగా, మహిళలపై దాడులకు సంబంధించి కొన్ని సవరణలు వీగిపోయాయి. యాసిడ్ దాడులకు పాల్పడిన నిందితులకు జీవిత ఖైదు విధించాలన్నసవరణపై మెజారిటీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు.  

ఇక పిల్లల అక్రమ రవాణా చేసిన వ్యక్తులకు జీవిత ఖైదు విధించాలన్న సవరణ సైతం వీగిపోయింది. కాగా మహిళలను వెంటాడి వేధించే వారికి ఎలాంటి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వరాదని బీజేపీ సూచించింది. పరస్పర ఆమోదయోగ్య శృంగారానికి 18 ఏళ్ళ వయస్సుకు సభ ఓకే చెప్పింది. 

  • Loading...

More Telugu News