: పిటిషన్లు కొట్టివేసిన సుప్రీం కోర్టు
ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజనపై వేసిన 9 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పుడున్న స్థితిలో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ పిటిషన్ ను కొట్టివేస్తున్నామని తెలిపింది. రాష్ట్ర విభజనపై సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్ దత్తు, జస్టిస్ బొబ్డే బెంచ్ విభజనపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఆర్టికల్ 3 పై స్పష్టత ఇవ్వాలన్న న్యాయవాదుల అభ్యర్థనను కూడా పట్టించుకోలేదు.