: ఆస్ట్రేలియా పోలీసులూ ఘనాపాఠీలే!


మనదేశంలో పోలీసులు పలు క్రిమినల్ చర్యలకు పాల్పడిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అదే, అమెరికా, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాల్లో పటిష్ఠమైన పోలీస్ వ్యవస్థ ఉంటుందని, అక్కడి పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరిస్తారని ఓ ప్రతీతి. కానీ, వారిలోనూ కొందరు ఘనాపాఠీలున్నట్టు ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్న ఈ ఘటన తేటతెల్లం చేస్తుంది. క్వీన్స్ ల్యాండ్ లోని మాకే నగరంలో గత ఆదివారం రాత్రి ఇద్దరు పోలీస్ అధికారులు పెట్రోలింగ్ చేస్తుండగా, బాధితురాలు వారికి తారసపడింది. లిఫ్ట్ ఇస్తామని చెప్పి పోలీస్ వాహనంలో ఎక్కించుకుని, ఆమెపై అత్యాచారం చేశారు. వంతులవారీగా, ఒకరు వాహనం డ్రైవ్ చేస్తుండగా, మరొకరు వెనుకసీట్లో ఆమెను తమ కామవాంఛలకు బలిచేశారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ ఇద్దరు కాముక పోలీసు అధికారులను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు వారిద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. దీనిపై స్పందిస్తూ, మాకే పోలీస్ కమిషనర్ ఇయాన్ స్టివార్ట్ తమ శాఖ ప్రతిష్ఠకు ఇది అవమానకరమని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News